![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో... కావ్యకి బాగోలేదని స్వప్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అదే టైమ్ కి శ్వేతకి గాయం కావడంతో రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. అక్కడ ఉన్న సిస్టర్స్ రాజ్ శ్వేతలని కాబోయే భార్య భర్తలని అనుకోవడం కావ్య విని బాధపడుతుంది. ఆ తర్వాత కావ్య రిపోర్ట్స్ వచ్చాయంటు స్వప్న వస్తుంది.
మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి ఇందిరాదేవి వెళ్ళి.. వంట చెయ్ ఈ రోజు కావ్యకి బాలేదని చెప్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న కళ్యాణ్ తో.. నా గదిలో గీజర్ పాడైంది చూసుకోమని ఇందిరాదేవి చెప్తుంది. అదంతా విన్న రుద్రాణి.. ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. చూసావా ఈ ఇంట్లో నీ కొడుకు స్థానమని అంటుండగా కళ్యాణ్ ని అపర్ణ పిలిచి.. గుడికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు తీసుకొని వెళ్తావా? నువ్వు ఖాళీగా ఉంటావని అడుగుతున్నానని అపర్ణ అనగానే కళ్యాణ్ సరే పెద్దమ్మ అంటాడు. ఆ మాటలు అన్ని రుద్రాణి, ధాన్యలక్ష్మి వింటారు. చూసావ్ కదా కళ్యాణ్ ఇంట్లో సర్వెంట్ అయిపోయాడు. అనామికకి కూడా కొన్ని రోజులు అయితే పనులు చెప్తారు. కావ్య అంటే ఎవరికి ఇష్టం లేకున్నా రాజ్ భార్య కాబట్టి అందరు తనకి విలువ ఇస్తారని రుద్రాణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత కావ్య ఇంటికి వస్తుంది. ఏమన్నారు డాక్టర్ అని ఇందిరాదేవి అడుగుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి కాసేపు పడుకుంటానని ఇందిరాదేవితో కావ్య చెప్పి వెళ్లిపోతుంది. ఏదో టెన్షన్ పడుతుందని స్వప్న అనగానే.. ఇంట్లో అందరు తనఫై విరుచుకుపడడటమే కదా.. టెన్షన్ ఉండదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ కి సంబంధించిన జ్ఞాపకాలన్ని అప్పు మంటలో వేస్తుంది. ఇక నుండి అన్ని మర్చిపోయా హ్యాపీగా ఉంటాను.. నా ఫ్యామిలీ గురించి తప్ప ఎవరి గురించి అలోచించనని అప్పు అనగానే ఇంట్లో వాళ్ళు సంబరపడతారు.
ఆ తర్వాత కావ్య కాకుండా అనామిక భోజనం వడ్డీస్తుంటే.. రాజ్ వచ్చి కావ్యకి ఏమైందని అడుగుతాడు. నీకు తెలియదా కావ్యకి బాలేదని ఇందిరాదేవి చెప్తుంది. నీకు ఫోన్ చేసింది నువ్వు బిజీగా ఉన్నావని స్వప్న హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళిందని ఇందిరాదేవి చెప్తుంది. అవును చేసిందని.. తను చిరాకు పడ్డ విషయం గుర్తుకు చేసుకుంటాడు. ఆ తర్వాత నాకు ఆకలిగా లేదంటూ రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రుద్రాణి కావాలనే గీజర్ పాడైంది కదా.. ఇప్పుడు వేడి వాటర్ ఎలా అనగానే.. కళ్యాణ్ చేయించలేదు.. ఇంత బాధ్యత లేకపోతే ఎలా అని అపర్ణ అంటుంది. ఏంటి అక్క కళ్యాణ్ ఎలా కన్పిస్తున్నాడు.. ఏమైనా సెర్వెంటా? పెళ్ళానికి బాగోలేకపోతే పట్టించుకోలేనంత బిజీగా రాజ్ ఉంటే.. నా కొడుకు మాత్రం ఇలా పనులు చెయ్యాలా? ఇన్ని రోజులు ఓపిక పట్టానని ధాన్యలక్ష్మి అనగానే.. అలా మాటలు వదిలెయ్యాకని ఇందిరాదేవి అంటుంది. మనసులో ఇంత పెట్టుకొని బయటకు అక్క అని ఎలా మాట్లాడుతున్నావ్? ఇక నుండి ఎవరు ఏ పనులు చెయ్యకండని అపర్ణ కోపంగా అనేసి వెళ్లిపోతుంది. రుద్రాణి, అనామిక ఇద్దరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అనామిక తన అమ్మకి ఫోన్ చేసి జరిగింది చెప్పి.. కళ్యాణ్ నేను చెప్పింది వినేలా చేసుకుంటాను. ఇంట్లో తోడికోడళ్ళకి గొడవలు పెట్టానని చెప్తుండగా కళ్యాణ్ వస్తాడు . మాట్లాడింది విన్నాడేమోనని భయపడుతుంది కానీ తను ఆ మాటలేం వినడు. కళ్యాణ్ రొమాంటిక్ గా దగ్గరికి వస్తుంటే.. మళ్ళీ పెద్దలు ముహూర్తం పెట్టాకే శోభనమని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |